- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెజాన్ వెబ్ సర్వీసెస్.. ఇప్పుడు హైదరాబాద్ లో.!
by Geesa Chandu |
అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇంకా ఇతర అధికారుల పర్యటన కొనసాగుతుంది.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇంకా ఇతర అధికారుల పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన లో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అమెజాన్ కంపెనీతో జరిగిన చర్చలు విజయవంతమైనట్టు మంత్రి పేర్కొన్నారు. అంతేకాక హైదరాబాద్ లో అమెజాన్ కంపెనీని విస్తరించేందుకు కంపెనీ ప్రతినిధులు సుముఖంగా ఉన్నట్లు కూడా శ్రీధర్ బాబు తెలిపారు. అయితే తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాల గురించి కంపెనీతో చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగుతుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
Next Story






