ఏపీ రాజధానిగా అమరావతి: మాజీ ఎంపీ వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

ఏపీ రాజధానిగా అమరావతి: మాజీ ఎంపీ వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో పరస్పర సహకారం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కొత్త కంపెనీల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలకు, వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నామని వీహెచ్ గుర్తుచేశారు. ఇదే సూత్రాన్ని ఏపీ ప్రభుత్వం కూడా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. "తెలంగాణలో పరిశ్రమల స్థాపనలో ఏపీ వారికి మేము తగిన అవకాశాలు కల్పిస్తున్నాం. ఇక్కడ ఎంతో మంది ఏపీ వ్యక్తులు వ్యాపారాలు సాగిస్తున్నారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కంపెనీల ఏర్పాటు విషయంలో తెలంగాణ వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులు, ఉపాధి విషయంలో సమతుల్యత ఉండాలి. అప్పుడే ఇరు రాష్ట్రాల యువతకు మేలు జరుగుతుంది" అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో, ఇలాంటి ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ తరహాలోనే అమరావతి కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూనే, అక్కడ తెలంగాణ పెట్టుబడిదారులకు, నిపుణులకు తలుపులు తీయాలని ఆయన కోరారు.

Next Story