Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. రంగంలోకి ‘వకీల్ సాబ్’?

by Gantepaka Srikanth |

పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో మెగా హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. రంగంలోకి ‘వకీల్ సాబ్’?
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో మెగా హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు(Chikkadapally Police) నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ కేసును వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది, ప్రముఖ నిర్మాత అయిన నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాసేపట్లో ఆయన హైకోర్టుకు చేరుకుంటారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Next Story