- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏలేటి ఎదురుచూపులు.. హిల్ట్ పాలసీపై తీవ్ర ఆరోపణలు
HILT (హిల్ట్) పాలసీతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6.30 లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు ఆధారాలతో సహా రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ HILT (హిల్ట్) పాలసీతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6.30 లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు ఆధారాలతో సహా రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. శాసన సభ మీడియా పాయింట్ వద్ద మూడు కుర్చీలు వేసి కాంగ్రెస్ నేతలకు కోసం ఏలేటీ ఎదురు చూశారు. ఒక కుర్చీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మరో కుర్చిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ నాయకుల కోసం ఏలేటీ ఎదురుచూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. HILT పాలసీలో పారదర్శకత ఉంటే మంత్రి ఉత్తమ్ ఎందుకని చర్చకు రాలేదు? అని ప్రశ్నించారు.
పాలసీ ప్రతిపక్షాలకు అర్ధం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాళాకోరుతనానికి నిదర్శనం అని విమర్శించారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీ మీడియా పాయింటుకు రమ్మని నిన్న చేసిన సవాలును మంత్రి ఉత్తమ్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. అంటే హిల్ట్ పాలసీలో పారదర్శకత లేదని రుజువైనట్టే కదా అని ఆరోపించారు. హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నట్లు ఆధారాలతో సహా రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తను రుజువు చేసినట్లయితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.






