ఆ పరిశ్రమలన్నీ ఔటర్ బయటకే : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

ఆ పరిశ్రమలన్నీ ఔటర్ బయటకే : భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సభ్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖల్లో ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు ప్రదర్శించిన అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు అభినందించారు. సమావేశంలో రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు శాఖలో ప్రభుత్వ ప్రతిపాదనలు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్, రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్, హౌసింగ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతం తదితరులు పాల్గొన్నారు.

Next Story