- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు పార్టీలది రాజకీయ డ్రామా : Jaggareddy
బీజేపీ, టీఆర్ఎస్, షర్మిల వ్యవహారం అంతా రాజకీయ డ్రామా అని సంగరెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, టీఆర్ఎస్, షర్మిల వ్యవహారం అంతా రాజకీయ డ్రామా అని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అవగాహనతోనే మూడు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. షర్మిల బీజేపీకి లాభం చేకూర్చేందుకు రాజకీయం చేస్తుందా లేక టీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకు పని చేస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. వీళ్లంతా కలిసి తెలంగాణలో ఓటు బ్యాంకు చీలిక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకుంది కాంగ్రెస్ పార్టీ వాళ్లే అన్నారు. ఇప్పుడు తన్నించుకున్న వాళ్లే కేసీఆర్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ దెబ్బతిందని తెలిపారు.
Also Read......
Next Story






