Telangana Weather Updates : భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

by Disha Web Desk 4 |
Telangana Weather Updates : భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, మేడ్చల్, మహబుబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలో ఎల్లో వార్నింగ్ ఆదేశాలు జారీ చేశారు.

నిన్నటి వరకు ఏర్పడిన చత్తీస్‌ఘడ్ ఉపరితల ఆవర్తనం.. నైరుతి రుతుపవనాల్లో మర్జ్ అయ్యిందని, ఈ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న మూడు రోజులు కురిసే అవకాశం కన్పిస్తుందని తెలిపారు. అలాగే రేపు ఉదయం ఎక్కువగా వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీమ్, మంచిర్యాల ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.

మోస్తారు నుంచి భారీ వర్షాలు రేపు యాదాద్రి, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ప్రాంతాల్లో ఉండే అవకాశాలన్నాయని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మోస్తారుతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుతున్నప్పటికి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు గాలి తీవ్రత ప్రతి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లకు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

Read more: Hyderabad rains: వర్షాలతో స్థంభించిన జనజీవనం

Next Story

Most Viewed