దిశ ఎఫెక్ట్...గాంధీనగర్ లో నీటి సమస్యపై అధికారుల పర్యవేక్షణ

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్...గాంధీనగర్ లో నీటి సమస్యపై అధికారుల పర్యవేక్షణ
X

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో తీవ్ర మంచినీటి కొరత ఉండడంతో కాలనీ వాసులు మూడు రోజుల క్రితం మహిళలు ఖాళీ బిందెలతో చేగుంట- మెదక్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వార్త దిశ దినపత్రికలో ప్రచురితమైన వి‌షయం తెలిసిందే. కాగా మిషన్ భగీరథ, మండల పరిషత్ అధికార బృందం రెండు రోజుల నుండి గాంధీ నగర్ కాలనీలో మంచినీటి సమస్యపై కాలనీలో తిరుగుతూ పర్యవేక్షించారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి దామోదర్, పంచాయతీ ఈఓ సంతోష్ కుమార్, సిబ్బంది అలాగే కాలనీవాసులను నీటి విషయమై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో

మాట్లాడుతూ నీటి సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మహిళలు కల్పించుకొని మాట్లాడుతూ పంపు వాటర్ మెన్లు కొట్టంల సిద్ధిరాములు, భూమయ్య సరిగా విధులు నిర్వహించడం లేదని, ఉన్నతాధికారులకు కాలనీవాసులు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని, దీనివల్ల నీటి సమస్య ఏర్పడిందని, ఎంపీడీఓ దామోదర్ కు కాలనీ వాసులు తెలిపారు. దీంతో ఎంపీడీవో బృందం కాలనీలో నీటి సమస్య పట్ల జీపీ బోరును మరమ్మతు చేపట్టి వాటర్ ట్యాంక్ ని అందించినట్లు తెలిపారు. ఈ విషయమై మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ కమలాకర్, డీఈఈ శ్రీనివాస్, సంపత్, ఏఈఈలు తిరుమలేశ్, నిఖిల, మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో దామోదర్ గురువారం నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed