మనమంతా హిందువులం కాదా? మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-05-02 10:10:47.0  )
మనమంతా హిందువులం కాదా?  మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్షింతలు పంచి రాముడి ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారు.. మనమంతా హిందువులం కాదా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హుజురాబాద్- జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చి.. అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి అంటున్నారు.. మీరు అధికారంలోకి రాక ముందే బీజేపీ నల్లధనం తెచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు.. వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, రైతులకు పెన్షన్ లాంటివి ఇస్తామన్నారని కానీ ఇవ్వలేదన్నారు.

తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదన్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతలను ఇబ్బందులు పెట్టారన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేత బండి సంజయ్ నియోజకవర్గంలో తిరగక.. ఎక్కడ అభివృద్ధి చేయలేదన్నారు. పదేళ్లు బీజేపీ అధికారంలో ఉండి ఈ పార్లమెంట్ సభ్యుడు ఐదేళ్లు ఉండి ఏం చేశారు.. అని నిలదీశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జమ్మికుంట మండలానికి మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, రైల్వే స్టేషన్, ఫైర్ స్టేషన్ తెచ్చినట్లు గుర్తుచేశారు. తిరుపతి రైలు సైతం తెచ్చిన ఇలాంటి అభివృద్ధి మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రావాలి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కి తోడు గా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed