దిశ ఎఫెక్ట్​… స్పందించిన జిల్లా కలెక్టర్

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్​… స్పందించిన జిల్లా కలెక్టర్
X

దిశ, చింతలమానేపల్లి : దిశ కథనానికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ గౌతరే స్పందించారు. ఈనెల 28న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా దిశ ఎడిషన్ లో బాలాజీ అనుకోడ గ్రామంలో పడకేసిన పారిశుధ్యం… సగం ఊరేగి జనాలలో తీవ్ర జ్వరాలు అనే కథనానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ గౌతరే స్పందించారు. చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రవీంద్ర నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో జ్వరాలు తీవ్రంగా ఉండడంతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక క్యాంపులో 300 మంది వైద్య రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ రాజకుమార్ తెలిపారు. రోగుల రక్త నమోనాలు సేకరించినట్లు తెలిపారు. ఈ వైద్య క్యాంపులో గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్ తో పాటు హెల్త్ సూపర్వైజర్ ఇందిరా, ఏఎన్ఎం రోష వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దిశ కథనంతో ప్రభుత్వ యంత్రాంగం స్పందించడంతో, గ్రామస్తులు దిశ యాజమాన్యానికి, రిపోర్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed