weapons: నేతల ఇల్లలో వెలుగుచూసిన మారణాయుధాలు.. ఆంధ్రాలో అసలేం జరుగుతోంది..?

by Indraja |
weapons: నేతల ఇల్లలో వెలుగుచూసిన మారణాయుధాలు.. ఆంధ్రాలో అసలేం జరుగుతోంది..?
X

దిశ వెబ్ డెస్క్: ఎన్నికలు ముగిసినా ఆంధ్రాలో అల్లర్లు మాత్రం ఆగడం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పల్నాడు జిల్లాలో శాంతిభధ్రతలు లోపించిన నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాగా శాంతిభధ్రతల సంరక్షణ దృష్ట్యా పోలీసులు పల్నాడు జిల్లాలోని మాచవరం మండలంలోని సమస్యాత్మక గ్రామం పిన్నెల్లిలో గురువారం సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో గ్రామానికి చెందిన వైసీపీ నేతల ఇల్లలో పెట్రో బాంబులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు, అలానే టీడీపీ సానుభూతిపరులు ఇళ్లపైన బీరు సీసాలు, రాళ్లు గుర్తించారు. మారణాయుధాలను కలిగి ఉన్న వారిలో వైసీపీ నేతలు మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు చింతపల్లి చిన మస్తాన్‌వలి అలియాస్‌ నన్నే, పార్టీ నాయకులు చింతపల్లి పెదసైదా, అల్లాభక్షు, టీడీపీ సానుభూతిపరులు చింతపల్లి జానీ బాషా, చింతపల్లి జానీ, తండా పెద్దనన్నే ఉన్నారు.

కాగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ.. నిందితులపై కేసులు నమోదు చేశామని..పెట్రోల్‌ బాంబులు తయారు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే పరారీలో ఉన్న ఇతరులను పట్టుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed