మూల్యం చెల్లించుకోక తప్పదు.. మావోయిస్టు నేత ఆజాద్ పేరుతో లేఖ విడుదల

by Rajesh |
మూల్యం చెల్లించుకోక తప్పదు.. మావోయిస్టు నేత ఆజాద్ పేరుతో లేఖ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు నేత, బీకేఏఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ పేరుతో శుక్రవారం లేఖ విడుదల కావడం సంచలనంగా మారింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఫేక్ ఎన్ కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆది వాసీలను చంపి ఎన్ కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూడు నెలల్లో 103 మందిని ఎన్ కౌంటర్ చేశారని తెలిపారు. వారిలో 60 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారన్నారు. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల దాడులు ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అయితే ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్‌లలో మావోయిస్టులు మృతి చెందుతుండగా.. తాజా లేఖతో మావోయిస్టుల ప్రతీకార దాడులపై ఆందోళన నెలకొంది.

Next Story

Most Viewed