ఫీ రిఫండ్ చెయ్యకుండా చుక్కలు చూపెడుతున్న ఆకాశ్ కాలేజీ

by Disha Web Desk 4 |
ఫీ రిఫండ్ చెయ్యకుండా చుక్కలు చూపెడుతున్న ఆకాశ్ కాలేజీ
X

దిశ హన్మకొండ టౌన్ : కాలేజీ ఎలా ఉందో చూసొద్దమని వెళితే ఏకంగా రూ.12వేలను బలవంతంగా కట్టించుకున్నారు. కాలేజీ నచ్చలేదు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే దాటవేస్తున్నారు. దీంతో బాధితురాలు కాలేజీ యాజమాన్యం తీరుపై మండి పడ్డారు. ఈ ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. గోవిందరావు పేటకు చెందిన ఆకుల కృష్ణవేణి అనే మహిళ తన కూతురు సింధుజ ఉన్నత చదువుల కోసం హన్మకొండలో ఉన్న పలు కళాశాలల్లో వసతులు, అందిస్తు్న్న విద్య గురించి వాకబు చేసింది. అదే క్రమంలో ఆకాష్ కాలేజీలో కూడా ఎంక్వయిరీ చేసింది. ఆ సమయంలో రెసిప్షన్‌లో వ్యక్తి ఫోన్ నంబర్‌ని సేకరించారు. అనంతరం కాలేజీలో పనిచేసే ప్రణీత్ అనే వ్యక్తి పలుమార్లూ ఫోన్ చేసి కాలేజీ వాతావరణం బాగుంటదని చెప్తే ఒక్కసారి చూసొద్దామని వెళ్లారు.

ఆసందర్భంలో కాలేజీలో బోధనలు బాగుంటాయని తెలిపారు. కొంత అమౌంట్ కట్టండని కోరగా రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం నామినల్‌గా ఉంచండని కోరాం. అయినా ఒత్తిడి చేయడంతో రూ.12వేలని రిసెప్షన్‌లో చెల్లించాం. తీరా మాకు తెలియకుండానే, మా సంతకాలు లేకుండానే అడ్మిషన్ చేసాము అని బాధితురాలి‌తో ప్రణీత్ అనడంతో బాధితురాలు అవాక్కయ్యారు. కాలేజీ వాతావరణం తమకు నచ్చలేదని బాధితురాలు తెలిపారు. ఫోన్లు విద్యార్థులకు అనుమతించడం, మితి మీరిన స్వేచ్చ ఇష్టం లేక విత్ డ్రా చేసుకోవాలని చూస్తే రూ.12 వేలు చెల్లించాలని ప్రణీత్‌ని కోరాం. అయితే ఈ విషయంలో ఆకాశ్ ఇనిస్టిట్యూట్ బ్రాంచ్ మేనేజరుని అడిగితే తమకేం సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

ప్రణీత్ తమ వద్ద పనిచేయడం లేదని చెప్పడం గమనార్హం. అకాశ్ ఇనిస్టిట్యూట్ వారు భాద్యత వహించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయాలని బాధితురాలు కోరింది. ప్రణీత్‌నీ అడిగితే.. వాళ్ళ ఇష్ట ప్రకారమే అడ్మిషన్ ఇప్పించాను. అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుంటే అమౌంట్ రాదని ఫార్మాలిటీ ప్రకారం అడ్మిషన్ ఫీ లేనిది హాస్టళ్లలో అనుమతించరన్నారు. కాలేజీ రూల్స్ అని డబ్బులు చెల్లించడం లేదని బాధితురాలు వాపోయారు. యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా కేసు పెట్టుకుంటే పెట్టుకొండి అనడం గమనార్హం. తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాధితురాలు కోరింది.



Next Story

Most Viewed