- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సవతి తల్లి ప్రేమ వద్దు.. జీతాలు పెంచండి చాలు’: ఏఐటీయూసీ డిమాండ్
by Gantepaka Srikanth |
నేషనల్ హెల్త్ మిషన్ స్కీం(National Health Mission Scheme)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్

X
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెల్త్ మిషన్ స్కీం(National Health Mission Scheme)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏఐటీయూసీ(AITUC) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహా డిమాండ్ చేశారు. శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోటీ ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 1000 మంది నాలుగో తరగతి సిబ్బంది ఈ స్కీం కింద పనిచేస్తున్నారని అన్నారు. వీరికి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని.. సవతితల్లి ప్రేమ వద్దని.. దయచేసి జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం సమర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చీప్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పద్మజాకు అందజేశారు.
Next Story






