AICC: రాజ్యాంగం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుంది: రాహుల్ గాంధీ

by Ramesh Goud |   (  Updated:2024-11-26 05:36:07  IST  )

రాజ్యాంగం(Constitution) ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు.

AICC: రాజ్యాంగం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుంది: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగం(Constitution) ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు. రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ఆయన.. ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు(Greetings) తెలియజేశారు. దీనిపై రాహుల్.. న్యాయం, హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నదే మన రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తి అని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించాలని అన్నారు. అంతేగాక సమాజంలోని పేద, అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి రాజ్యాంగం ఒక శక్తివంతమైన సాధనమని, అది ఎంత బలంగా ఉంటే మన దేశం అంత బలపడుతుందని చెప్పారు. ఈ రోజున రాజ్యాంగ భావనను పరిరక్షించిన యోధులు, అమరవీరులు, రాజ్యాంగ పరిషత్‌లోని ప్రతి సభ్యునికి నివాళులు అర్పిస్తూ.. దానిని పరిరక్షించాలనే నా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Next Story