- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
congress: తెలంగాణ మంత్రుల్లో ప్రమోషన్ ఎవరికి? డీమోషన్ ఎవరికి? కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం
ఏడాది పాలనపై అధిష్టానం ఫోకస్.. శాఖల వారీగా శాఖలవారీగా కేసీ వేణుగోపాల్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై హస్తం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పని తీరుపై ఇవాళ సమీక్ష నిర్వహిస్తోంది. సంస్థాగత అంశాలతో పాటు శాఖలవారీగా ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) నివాసం కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శాఖలవారీగా సమీక్షతో పాటు ప్రతి మంత్రితోనూ ముఖాముఖి నిర్వహించి వారితో ఈ ఏడాది కాలంలో ప్రోగ్రెస్ పై కేసీ వేణుగోపాల్ చర్చించనున్నట్లు సమాచారం.
ప్రమోషన్ ఎవరికి? డీమోషన్ ఎవరికి?:
ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై అధిష్టానం సీక్రెట్ సర్వే నిర్వహించింది. ఇందులో పలువురు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా అధిష్టానం అన్ని కోణాల్లో లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఆధారంగా కొంత మందిని తప్పిస్తారనే ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పీఏసీ సమావేశంలోనూ రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ గట్టి వార్నింగ్ ఇచ్చారని స్వయంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఇటీవల వెల్లడించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరి పోస్టుకు కత్తెర పడనుంది మరెవరికి ప్రమోషన్ దక్కనుంది అనేది ఉత్కంఠగా మారింది.






