విద్యార్ధుల్లో పర్యావరణ పెంపు భావన పెరగాలి : అగ్రికల్చర్​వర్సిటీ వీసీ జానయ్య

by Ajay Maddhiboyina |

అగ్రికల్చర్​యూనివర్శిటీ విద్యార్థులు నాటిన మొక్కలను చిన్న బిడ్డల మాదిరిగా సంరక్షించాలని, మొక్కలను ప్రేమతో పెంచితే భవిష్యత్తులో సమాజానికి ఆక్సిజన్ తో పాటు ఆశను అందిస్తాయని ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.

విద్యార్ధుల్లో పర్యావరణ పెంపు భావన పెరగాలి : అగ్రికల్చర్​వర్సిటీ వీసీ జానయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : అగ్రికల్చర్​యూనివర్శిటీ విద్యార్థులు నాటిన మొక్కలను చిన్న బిడ్డల మాదిరిగా సంరక్షించాలని, మొక్కలను ప్రేమతో పెంచితే భవిష్యత్తులో సమాజానికి ఆక్సిజన్ తో పాటు ఆశను అందిస్తాయని ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. విద్యార్థులు నాటిన మొక్కలను నాలుగు సంవత్సరాల పాటు సంరక్షిస్తే పట్టభద్రులు అయ్యే సమయంలో ఆ మొక్కతో పాటు విద్యార్థి ఫోటోను గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను మరింతగా పెంపొందించే వినూత్న ఆలోచనగా అభివర్ణించారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే ద్వారా పర్యావరణహిత జీవన విధానాలు, పచ్చదనం పెంపొందించడం, వనరుల సుస్థిర వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్ లో తమ వృత్తి జీవితంలోనూ పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించాలని సూచించారు. బీఎస్సీ ఏజీ మొదటి సంవత్సర విద్యార్థులు సుమారు 500 మొక్కలను నాటడంపై అభినందించారు. ఈ భారీ స్థాయిలో మొక్కలు నాటడం ద్వారా క్యాంపస్ ను హరితమయం చేయడమే కాకుండా, పర్యావరణ సంరక్షణపై విద్యార్థుల్లో దీర్ఘకాలిక అవగాహన కలిగిస్తుందన్నారు. ఎన్​ఎస్​ఎస్​ప్రోగ్రామ్ ఆఫీసర్లు చురుగ్గా పాల్గొని మొక్కలు నాటడం, విద్యార్థులను సమన్వయపరచడం కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమానికి వీఎస్​ఎన్​వీ ,శ్రీనివాస్, రిజిస్ట్రార్ డాక్టర్​ విద్యాసాగర్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డీన్ డాక్టర్ గోవర్ధన్ పాల్గొన్నారు.

Next Story