- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అగ్రికల్చర్శాఖ వాట్సాప్ ఛానల్ ప్రారంభం
రాష్ట్ర వ్యవసాయ శాఖ కొత్తగా వాట్సప్ ఛానెల్ ను ప్రారంభించింది. అగ్రికల్చర్ డిపార్టు మెంట్ తెలంగాణ పేరుతో గత నెల 8న అందుబాటులోకి తెచ్చింది. నెల రోజులు గడవక ముందే దాదాపు 32 వేల మంది రైతులు ఫాలోవర్స్ గా ఉన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ కొత్తగా వాట్సప్ ఛానెల్ ను ప్రారంభించింది. అగ్రికల్చర్ డిపార్టు మెంట్ తెలంగాణ పేరుతో గత నెల 8న అందుబాటులోకి తెచ్చింది. నెల రోజులు గడవక ముందే దాదాపు 32 వేల మంది రైతులు ఫాలోవర్స్ గా ఉన్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ రైతాంగానికి కీలకమైన సమాచారం, సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. ప్రధానంగా వాతావరణ హెచ్చరికలు, పంటల వివరాలు, పురుగు మందులు, ఎరువుల వివరాలు సులువుగా రైతాంగానికి సమాచారం తెలియజేస్తున్నారు. ఈ వాట్సప్ఛానెల్ ఎలా వినియోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేడానికి ఏఐ వీడియోను కూడా క్రియేట్ చేసి షేర్ చేశారు. రైతులకు సాగు చేస్తున్న ఆయా పంటలకు తెగుళ్లు పడితే ఎలాంటి మందులు చల్లాలి, ఏం చేయాలి అనే విషయాలను ఆశాఖ సమాచారం ఇస్తుంది.
రాష్ట్రంలో ప్రధాన పంటగా ఉన్న వరిలో పాముపొడ తెగులు, ఆకు ముడత నివారణ కోసం శాస్త్రవేత్తల సూచనల మేరకు చేపట్టాల్సిన చర్యలు వివరంగా షేర్ చేసింది. ఇక కంది, మొక్కజోన్నలో కాండం తొలుచు పురుగు కోసం వాడాల్సిన పురుగు మందులు, పత్తిలో జింక్ లోపం సవరణ, పచ్చదోమ నివారణ వంటి వాటికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఉద్యాన వన పంటల విషయంలో సవాళ్లు, సమస్యలు ఎదురైతే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను అందిస్తుంది. మధ్య మధ్యలో రైతులకు వ్యవసాయానికి సంబందించి క్విప్ పోటీలను సైతం ఈ వాట్సప్ చానల్ లో నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందేశాన్ని, ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల వివరాలు, వీడియో లింక్ లు అన్ని రైతులకు వ్యవసాయ శాఖ చేరవేస్తుంది. రైతులకు సమాచారం ఇవ్వడమే కాకుండా గ్రూప్ డిస్కషన్ కోసం జూమ్ సమావేశాలకు సంబందించిన లింక్ లను కూడా పంపిస్తుంది.
దీని ద్వారా నేరుగా రైతులు వారి సమస్యలను పంటల వివరాలు చెప్పడానికి వేదికగా మారింది. ఎప్పటికప్పుడు రైతులకు సమాచారాన్ని, అవగాహాన పెంపోందించడానికి కీలకంగా పనిచేస్తున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛానెల్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి తెలిపారు. రైతుల బీమా కు సంబందించిన సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వివరాలు, పంటల సంరక్షణ సీజనల్ సూచనలు, ఆయా పంటలకు కీటక నియంత్రణ మార్గదర్శకాలు. మార్కెట్ ధరలు, శిక్షణా కార్యక్రమాల అప్ డేట్లు ఇలా అన్ని వివరాలు అరచేతిలో వున్న సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అంతేకాదు రైతు నేస్తం కార్యక్రమాల షెడ్యూల్ వివరాలు కూడా తెలియజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం వ్యవసాయ శాఖ వాట్సప్ చానల్ ను ఫాలో కావాలని కోరారు.






