- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌలు రైతు కుటుంబానికి భూమి సునీల్ ఆర్థికసాయం
అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి వ్యవసాయ కమిషన్ సభ్యులు భూమి సునీల్ బాసటగా నిలిచారు. తన తండ్రి జ్ఞాపకార్థం వారికి ఆర్థికసాయం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ కమిషన్ సభ్యులు భూమి సునీల్ తండ్రి మేక సంజీవ రెడ్డి ద్వితీయ వర్థంతిని రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమంగా మార్చారు. తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గురువారం ములుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న గిరిజన కౌలు రైతు కుటుంబానికి తెలంగాణ వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేతుల మీదుగా రూ.25 వేల ఆర్థిక సాయం చేశారు. తార్నకలోని లీఫ్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి హాజరైన కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాములు నాయక్, గోపాల్ రెడ్డి ఆ కుటుంబానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దీనికి అదనంగా మరో రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు.
కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యంగా ఉంటూ వారి కుటుంబంలోని పిల్లల్ని బాగా చదివించాలని, అందుకు తగ్గ సాయం అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా దేవగిరిపట్నంకి చెందిన గిరిజన రైతు నాగవతరాజు (40) ఎనిమిది ఎకరాల భూమిని కౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. వరుసగా మూడు సంవత్సరాలు పంట నష్టం రావటంతో రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక 2020 జనవరి 23న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లావణ్య కూలీ పనులు, కుట్టు మిషన్‌తో పోషిస్తోంది. పెద్ద కుమార్తె తేజశ్రీ మానసిక వికలాంగురాలు కాగా, చిన్న కుమార్తె అంజలి, కుమారుడు జస్వంత, ఆర్థ ఉన్నారు.






