జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్, బీజేపీ తర్వాత నోటాకే అధిక ఓట్లు

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పై 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్, బీజేపీ తర్వాత నోటాకే అధిక ఓట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పై 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో యూసఫ్ గూడ, గాంధీభవన్, సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు షురూ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా.. మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ ముగ్గురు కాకుండా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పలు పార్టీలు, ఇండిపెండెంట్లుగా 55 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 13 మందికి త్రీ డిజిట్ ఓట్లు రాగా.. ఒకరికి సింగిల్ డిజిట్ ఓట్లు పోలయ్యాయి. మిగతా వారికి డబుల్ డిజిట్ లో ఓట్లు వచ్చాయి. కానీ.. వీరందరికంటే.. నోటాకే అధిక ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల తర్వాత నోటాకే అధిక ఓట్లు రాగా.. వాటిలో రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉన్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. అంటే విధుల్లో ఉన్న అధికారుల్లో ఇద్దరు నోటాకు ఓటేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. 924 మంది ఓటర్లకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతో.. నోటాకు జై కొట్టారు.

Next Story