NIMS: నిమ్స్‌లో అడ్వాన్స్‌డ్ రెడ్ సెల్ సిరాలజీ వర్క్‌షాప్‌.. ఎప్పుడంటే..?

by Ramesh Naini |

నిజామ్స్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్‌)లో అక్టోబర్‌ 15న అడ్వాన్స్‌డ్ రెడ్ సెల్ సిరాలజీ హ్యాండ్స్‌-ఆన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.

NIMS: నిమ్స్‌లో అడ్వాన్స్‌డ్ రెడ్ సెల్ సిరాలజీ వర్క్‌షాప్‌.. ఎప్పుడంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Nizam's Medical Sciences) నిజామ్స్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్‌)లో అక్టోబర్‌ 15న అడ్వాన్స్‌డ్ రెడ్ సెల్ సిరాలజీ (Red Cell Serology) హ్యాండ్స్‌-ఆన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇమ్యునో హీమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ విభాగం, కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి నిమ్స్ డైరెక్టర్‌ డా. భీరప్ప, డీన్‌ డా. లిజా రాజశేఖర్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. న. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ డా. శాంత్వీర్‌ జి. ఉప్పిన్ అతిథులుగా పాల్గొంటారు. ముంబయి, హైదరాబాద్‌, బీబీనగర్‌ ఎయిమ్స్‌ నుంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, విభాగాధిపతులు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. సిరాలజీ ప్రాక్టికల్ సెషన్లు, ప్రమాద నివారణ, క్లినికల్ కేస్ డిస్కషన్, వంటి కార్యక్రమాలు ఉంటాయి.

Next Story