రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలిపోయింది : డీకే అరుణ

by Dishanational2 |
DK Aruna
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుప్పకూలిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండ్డిపడ్డారు. మంగళవారం టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కావడంపై డీకే అరుణ స్పందించారు. మొన్న టీఎస్పీఎస్సీ, నిన్న పదవతరగతి తెలుగు, నేడు హిందీ ప్రశ్నపత్రాలు లీకవుతుంటే ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లు తయారైందని డీకే అరుణ విరుచుకుపడ్డారు.

ఈ ప్రభుత్వంలో ఎవరి శాఖకు ఎవరు మంత్రో కూడా అర్థం కావడం లేదని, అన్ని శాఖలకు తానే రాజు తానే మంత్రి అని స్పందించే ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, ప్రశ్నపత్రాలు ఏకధాటిగా లీకులు అయితుంటే ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ అధికారులపై పట్టు కోల్పోయారని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కేవలం స్కీముల పేర్లు చెప్పి, స్కాములు చేయాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారని, అదేవిధంగా తమ బిడ్డపై ఉన్న ప్రేమలో, కనీసం 10 శాతమైన తెలంగాణ ప్రజలపై ఉంటే బాగుండేదని డీకే అరుణ అన్నారు. లీకేజి వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించాలని డీకే అరుణ అన్నారు. నిందితులను సరైన విధంగా విచారణ చేపట్టి, వారి వెనుక ఉన్న అసలు సూత్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed