- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: తెలంగాణలో ఫూలే ఆశయాలకు విరుద్ధంగా పాలన: బండి సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యారంగం వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహాత్మా జ్యోతిబా ఫూలే (Mahatma Jyotiba Phule) ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన పుణ్యమా అని ఇప్పుడు నిండా అప్పుల్లో మనిగిపోయిందని ఆరోపించారు. ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇవాళ ఫూలే జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన చిత్రపటానికి బండి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు కొండంత ధైర్యం ఫూలే అని కొనియాడారు. అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి, పేదలను ఆదుకోవడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతుడని ప్రశంసించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఫూలే పేదల జీవితాల్లో అక్షర వెలుగులు నింపితే తెలంగాణలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పాలకులు విద్యా రంగాన్ని పూర్తిగా వెనక్కు నెట్టేశారని ఆరోపించారు.
గ్యారెంటీల పేరిట నట్టేట ముంచారు
అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికొదిలేసిందని బండి ఆరోపించారు. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. మహాత్ములకు నివాళులు అర్పించడమంటే వారి జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించుకోవడం కాదు.. వారి ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమేనన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే బకాయిలన్నీ చెల్లించి విద్యారంగ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






