- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మడుగు దాటితేనే కార్యాలయంలోకి అడుగు
వర్షం పడితే చాలు తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం చెరువును తలపిస్తోంది.

దిశ, భీంపూర్ : వర్షం పడితే చాలు తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం చెరువును తలపిస్తోంది. తాంసి మండల కేంద్రంలో ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈఓ, వ్యవసాయ అధికారి కార్యాలయం, ఎంఆర్సీ, సహకార సంఘం కార్యాలయాలు ఒకే ఆవరణలో ఉండగా, పారుదల సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. ఒక్కసారి వర్షం పడితే ఆ నీరు కనీసం వారం నుంచి 10 రోజులపాటు నిలిచి ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గోడలు పట్టుకుని లోపలికి
వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు నిలిచిన నీటిలో కార్యాలయాల గోడలు పట్టుకుని నడిచి లోపలికి వెళ్లాల్సి వస్తోందని మండల కేంద్రానికి చెందిన అలలి నిఖిల్ తెలిపారు. ఎరువులు, విత్తనాలు తీసుకోవడానికి వచ్చే రైతులు బురదలో, నీటిలో నడవలేక ఇబ్బంది పడుతున్నారు.
అధికారులకు లాంగ్ జంప్ తప్పడం లేదు
వ్యవసాయ అధికారి కార్యాలయం చుట్టూ ఎక్కువగా నీరు నిలవడంతో విధులకు వచ్చే అధికారులు, సిబ్బంది సైతం లాంగ్ జంప్ చేస్తూ కార్యాలయంలోకి అడుగు పెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులు, అధికారులు ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు.
చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి కార్యాలయాలు నిర్మించినా, కనీసం పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలు నిర్మించి, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.






