- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ తలపై చెట్టు పడి మృతి
దండేపల్లి మండలం లోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శనిగారపు సునీత తలపై పై చెట్టు పడి మృతి చెందినట్టు జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్ గురు వారం తెలిపారు.

దిశ, జన్నారం : దండేపల్లి మండలం లోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శనిగారపు సునీత తలపై పై చెట్టు పడి మృతి చెందినట్టు జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్ గురు వారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన శనిగారపు జగన్ అతని భార్య శనిగారపు సునీత లు బుధవారం బైక్ పై కడెం మండలం లోని లింగాపూర్ గ్రామంలో గల బందువుల పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా రాత్రి మహమ్మదాబాద్ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి గాలి వాన కారణంగా రోడ్డు పక్కన గల చెట్టు వీరిపై పడటం తో సునీత కు తలకు గాయమై, జగన్ కి కాలుకు గాయలు కాగా చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి పరీక్షించి డాక్టర్లు సునీత నుచనిపోయినట్లు తెలిపారని జగన్ కి ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం గురించి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారని సునీత తండ్రి చెవులమద్ది శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






