రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో విజిలెన్స్ త‌నిఖీలు

by Nallavelli.Anjaneyulu |

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో విజిలెన్స్ త‌నిఖీలు
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు తొమ్మిది మందితో కూడిన బృందం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. దస్త్రాలను స్వాధీనం చేసుకుని వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలు డాక్యుమెంట్ రైటర్ల దుకాణాల్లో ఉన్న దస్త్రాలను కూడా కార్యాలయనికి తీసుకువచ్చి వాటిని సైతం సరి చూశారు. ప్రతి సంవత్సరం నిర్వహించే తనిఖీల్లో భాగంగానే కార్యాలయాన్ని సందర్శించిన‌ట్టు అధికారుల బృందం తెలిపింది. రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు జరుగుతున్నయన్న విషయం తెలుసుకున్న పలువురు డాక్యుమెంట్ రైటర్లు వారి దుకాణాలను మూసి వేశారు. తనిఖీలో ఎలాంటి అనుమానం కలిగించే దస్త్రాలు లభించలేదని అదికారులు చెప్పారు. ఈ దాడిలో ఐఓపీ అనిల్ కుమార్, తహశీల్దార్ దినేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వరప్రసాద్, రవీందర్, ప్రశాంత్ రావు తదితరులున్నారు.

Next Story