వాహ‌నాలు త‌నిఖీలు ప‌క‌డ్బందీగా చేప‌ట్టాలి : ఎస్పీ నితిక పంత్

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : వాహనాలను పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సిర్పూర్ టీ మండలంలోని వెంకట్రావు పేట గ్రామ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ కేంద్రాన్ని

వాహ‌నాలు త‌నిఖీలు ప‌క‌డ్బందీగా చేప‌ట్టాలి : ఎస్పీ నితిక పంత్
X

దిశ, ఆసిఫాబాద్ : వాహనాలను పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సిర్పూర్ టీ మండలంలోని వెంకట్రావు పేట గ్రామ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద డ్యూటీ లో ఉన్న సిబ్బందితో మాట్లాడి చెక్ పోస్ట్ లోని రికార్డులు. వాహనాల నమోదు వివరాలను ఆరాతీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టెందుకు అభ్యర్థులు అక్రమ మద్యం, డబ్బులు ఇతర నిషేధిత వస్తువులు తరలించే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ నిఘా పెంచాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అంతకుముందు చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని.. శాంతి భద్రతల విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వహీదుద్ధీన్, కౌటాల సీఐ సంతోష్ ఉన్నారు.

Next Story