- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ ఫోన్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
దిశ, ఆదిలాబాద్ : సెల్ ఫోన్ చోరీ కేసులో ఇద్దరూ అరెస్ట్ అయిన సంఘటన ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, ఆదిలాబాద్ : సెల్ ఫోన్ చోరీ కేసులో ఇద్దరూ అరెస్ట్ అయిన సంఘటన ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో గత ఏడాది అక్టోబర్ లో పట్టణానికి చెందిన సామల ప్రశాంత్ మొబైల్ ఫోన్ చోరికి గురైంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిషన్ సభ్యుడు బాలశంకర్ కృష్ణ, బైరి భాను ప్రసాద్ లను గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఇటీవలే నియామకమైన బాల శంకర్ కృష్ణ పై ఈ కేసులో అరెస్ట్ అవ్వడం కారణంగా తన పదవీ కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






