- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి: కలెక్టర్ రాజర్షి షా
by Jakkula.Mamatha |
ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నార్నూర్ మండలంలో కలెక్టర్ పర్యటించారు.

X
దిశ, నార్నూర్: ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నార్నూర్ మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా నడ్డంగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెదురు పరికరాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. వెదురు పరికరాల పద్ధతులు మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమాడ గ్రామంలో నిర్వహించిన తొమ్మిదవ ఇప్పపువ్వు లడ్డు పండుగలో పాల్గొన్నారు. ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డులో పౌష్టికాహారం పుష్కలంగా లభిస్తాయని అన్నారు. మొవా లడ్డు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఖైర్ దాట్వా మహిళకు రాష్ట్రపతి అవార్డు లభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మంకరందం, డిఆర్ డిఏ పీడీ రవీందర్, సర్పంచ్ కనక సత్య నారాయణ, ఎంపీడీఓ పుల్లారావు, అధికారులు, మహిళలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story






