- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆవు పై పులి దాడి..భయాందోళనలో ప్రజలు
దిశ, బెజ్జూర్ : ఆవు పై పులి దాడి చేసిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం లో పులి సంచరిస్తుంది.

దిశ, బెజ్జూర్ : ఆవు పై పులి దాడి చేసిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం లో పులి సంచరిస్తుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం సిర్పూర్ మండలం నవేగాం గ్రామ గ్రామానికి చెందిన జుంగారి శివరాం ఆవుపై దాడి చేసి హతమార్చింది. నవేగం గ్రామ సమీపంలోనే ఆవు పై పులి దాడి చేయడంతో గ్రామస్తులంతా భయంతో గుంపులు గుంపులుగా పొలం వద్దకు వెళ్తున్నారు. అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన ఆవు పై పులి దాడి చేయడంతో కలకలం సృష్టించింది. దీంతో మండలంలోని నావేగం, ఇటిక్యాల పాడు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఎక్కడైనా పులి ఉన్నట్లు తెలిస్తే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.






