- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువు గండీ పనులకు మూడేళ్లకు మోక్షం..!
చెరువు గండి పనులకు మూడేళ్ల కు మోక్షం లభించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

దిశ, కుబీర్ : చెరువు గండి పనులకు మూడేళ్ల కు మోక్షం లభించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు గండి పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. దీంతో రబీ సాగు పంటల రైతులకు భరోసా కలుగనుంది. మూడేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు చెరువుకు భారీ గండి పడింది. దీంతో చెరువులో చుక్కనీరు కూడా లేకపోవడంతో భూగర్భ జలాలు అన్ని అడుగంటిపోయాయి. ఓ సంవత్సరం ఎలాగో గట్టెక్కింది. 2024లో మార్చి నెలలో వందల బోర్లు వట్టిపోయాయి. 2025లో భూగర్భ జలాలు మరింత అడుగంటి పోయాయి. చుట్టు పరిసరాల్లోని బోర్లు జనవరి నెల చివరిలోనే వట్టిపోయాయి. దీంతో వందల ఎకరాల్లో సాగైనా మొక్కజొన్న జొన్న, నువ్వు పంటలు ఎండిపోయాయి. స్థానిక రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన కాలయాపనే జరిగింది. ఎమ్మెల్యే రామారావు పటేల్ సంబంధిత శాఖ మంత్రికి ఇన్ చార్జి మంత్రి దృష్టికీ, అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించడంతో రూ.40లక్షల నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. ఇంత వర్షాకాలంలో నీళ్లు నిలిచి పంటలకు సాగుకు భరోసా కలుగుతుందని రైతులు ఆనంద పడుతున్నారు.






