- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి లో మోగిన సమ్మె సైరన్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు, 44 చట్టాలను 29 చట్టాల సవరణ చేసిన బిల్లు కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది.

దిశ, మందమర్రి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు, 44 చట్టాలను 29 చట్టాల సవరణ చేసిన బిల్లు కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణి కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటియూ, టీబీజీకేఎస్ వంటి సంఘాలు జేఏసీగా ఏర్పడి సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త సమ్మెకి నిరసనగా శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద రోడ్ పైనా ధర్నా చేపట్టిన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య నిరసన లో పాల్గొన ఇతర కార్మిక సంఘాలు .ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య మాట్లాడుతూ భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్న 44 చట్టాలు. ఇందులో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తీసుకొని వచ్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టుబనిసలు చేసిన నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా ధర్నా చేపట్టామన్నారు. ఏప్రిల్ 1 వ తేదీన బిల్లు అమలు లోకి తీసుకొని రావాలని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. అదానీ, అంబానీ లు బడా వ్యాపార వేత్తలకు సింగరేణి కాంట్రాక్ట్ పనులను అప్పచెప్పిన ఘనత బీజేపీ ప్రభుత్వం కి సాధ్యమైంది అన్ని మండిపడ్డారు.
ఎన్నికలు వచ్చినపుడు మాత్రం మత రంగుతో ప్రజలందరినీ చీల్చి బీజేపీ ఓట్లు అడుగుతున్నది.ఇప్పటికీ నాలుగు దఫాలుగా భారత కార్మిక సంఘాలు సమ్మెను చేశాం. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ లో తీర్మానం చేసి నాలుగు కోడ్ లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కి సిఫారసు చేశాయి. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీ లో నాలుగు కోడ్ వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని కోరారు. కార్మికులకు మెడికల్ బోర్డ్ జాప్యం చేయకుండా అమలు చేసే ప్రయత్నంతో పాటు సొంత ఇంటి పథకాన్ని కార్మికులను వర్తింప చేయాలి. ఇన్కమ్ టాక్స్ విషయంలో అధికారులు పునరాలోచించాలి. మారు పేరు మీదా ఉద్యోగం చేస్తున్న వారి సమస్య పరిష్కరించాలి అలాగే డిస్మిస్ కార్మికులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సింగరేణి సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒక బిఎంఎస్ తప్ప జేఏసీ గా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు . కొత్తగూడెం నుండి గోలెటి వరకు సమ్మెలో పాల్గొన్న ప్రతి కార్మికునికి విప్లవ ధన్యవాదాలు తెలిపారు. నిరసన చేపట్టిన కార్మిక సంఘాలను శ్రీరాంపూర్ సిఐ శ్రీలత, ఎస్సై మేకల సంతోష్ , అదనపు ఎస్సై లక్ష్మీ ప్రసన్న అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.






