కాగజ్ నగర్ లో నిబంధనలు మరిచిన పురపాలక సంఘం అధికారులు

by Ratna Kumari |

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జనవాసాల మధ్య వెలుస్తున్న స్క్రాప్ యార్డులు (పాత సామాను దుకాణాలు) స్థానిక ప్రజల

కాగజ్ నగర్ లో నిబంధనలు మరిచిన పురపాలక సంఘం అధికారులు
X

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జనవాసాల మధ్య వెలుస్తున్న స్క్రాప్ యార్డులు (పాత సామాను దుకాణాలు) స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. నిబంధనల ప్రకారం జనావాసాలకు దూరంగా ఉండాల్సిన ఈ యార్డులు, అధికారుల అండదండలతో కాలనీల మధ్యలోనే తిష్ట వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండు హాస్టళ్ల మధ్య వెలిసిన‌ ఒక స్క్రాప్ యార్డ్ కారణంగా అక్కడి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన, దుమ్ము, విషపూరితమైన వాయువు వెలువడడం వల్ల శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. పలు కాలనీలో రోడ్లను ఆక్రమించి సామాగ్రిని నిల్వ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

నిబంధనల ప్రకారం.. స్క్రాప్ యార్డులలో అగ్నిమాపక పరికరాలు, నీటి సౌకర్యం, ఇసుక ఆక్సిజన్ సిలిండర్లు వంటి ముందస్తు జాగ్రత్తలు ఉండాలి. కానీ, నగరంలోని ఏ ఒక్క దుకాణంలోనూ ఈ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినప్పటికీ, యజమానుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. బోర్డులు, పేర్లు లేకుండా నిర్వహిస్తున్న ఈ దుకాణాలు దొంగతనాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. పట్టణంలో జరుగుతున్న దొంగతనాల సొత్తు ఇక్కడికే చేరుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సామాన్యుల వస్తువులే కాకుండా, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ యంత్రాలు కూడా ఈ స్క్రాప్ యార్డులలో దర్శనమిస్తుండటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. లైసెన్సులు లేకున్నా, ఫైర్ సేఫ్టీ పాటించకున్నా తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్క్రాప్ యార్డులపై తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేయాలని, జనావాసాల మధ్య ఉన్న వాటిని తక్షణమే శివార్లకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానిక కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story