- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలయాపన చేస్తున్న మెడికల్ బోర్డు..!
దిశ, మందమర్రి : మెడికల్ విజిలెన్స్ పేరిట దందా చేస్తూ.. మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఏఐటీయూసీ

దిశ, మందమర్రి : మెడికల్ విజిలెన్స్ పేరిట దందా చేస్తూ.. మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ పేర్కొన్నారు. మందమర్రి ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వంను కలిసి ఆరు నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా మెడికల్ విజిలెన్స్ పేరిట దందా చేస్తూ కాలయాపన చేస్తుందన్నారు. ఇప్పటికైనా మెడికల్ బోర్డు జరిపి ఉద్యోగం చేయడానికి సిద్దంగా ఉన్న వారికీ పోస్టింగ్ ఇవ్వాలన్నారు. పోస్టింగ్ ఇవ్వకుండా వారిని మానసికంగా ఆర్ధికంగా, నష్టపరస్తున్నారని వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మెడికల్ బోర్డు జరిగి ఇన్వాలిడేషన్ అయినా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మైన్ స్టాప్ ఉద్యోగులకు మెడికల్ అయిన వారికి ఒప్పందం ప్రకారం.. వారికి సరైన జాబ్ సర్కులర్ ను విడుదల చేయాలని.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని మెడికల్ బోర్డు స్పందించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోబ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ బాణయ్య , ఫిట్ సెక్రటరీ గాండ్ల సంపత్, రాజేశ్వర్ రావు,జెట్టి మల్లయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.






