జర్నలిస్టుల హక్కుల సాధనే ప్రధాన లక్ష్యం : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్

by Ratna Kumari |

దిశ, జైనూర్ : జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా టియూడబ్ల్యూజే పోరాటం చేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని ఏ ఎం సి కార్యాలయంలో నిర్వహించిన యూనియన్

జర్నలిస్టుల హక్కుల సాధనే ప్రధాన లక్ష్యం : టీయూడబ్ల్యూజే  జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
X

దిశ, జైనూర్ : జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా టియూడబ్ల్యూజే పోరాటం చేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని ఏ ఎం సి కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ జైనూర్ , సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ జర్నలిస్టులకు సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సంఘ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కు అనుబంధంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం కలిగిన యూనియన్ గా టియూడబ్ల్యూజే గుర్తింపు పొందిందని అన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు అనారోగ్య, ఇతర ఎలాంటి సమస్యలు ఎదురైనా యూనియన్ అండగా ఉంటుందని గుర్తు చేశారు. జర్నలిస్టులు అవినీతికి తావు లేకుండా విలువలతో కూడిన జర్నలిజం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను జర్నలిస్టులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కోశాధికారి అడప సతీష్ , జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, జర్నలిస్టులు , అన్నరావు ,జిల్లా కార్యవర్గ సభ్యులు రాందాస్, రామేశ్వర్ , డాక్టర్ ఆసిఫ్ , ప్రకాష్, రవి, షర్ఫుద్దీన్ , శంకర్ , ఆత్రం రాము , మనోజ్ , శ్రావణ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసి రిపోర్టర్ కు ఆర్థిక సాయం అందజేత

జైనూర్ మండలంలోని పట్నాపూర్ కు చెందిన ఆదివాసి రిపోర్టర్ ఆత్రం రాము గత కొంతకాలంగా అనారోగ్యంతో గురైన విషయాన్ని తెలుసుకొని అతనికి వైద్య చికిత్స నిమిత్తం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 5000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ అందజేశారు. ఆత్రం రాముకు తమ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు.

Next Story