ఉదారతను చాటిన ఎన్ఆర్ఐ.. రూ. లక్ష ఆర్థిక సాయం

by Disha Web Desk 4 |
ఉదారతను చాటిన ఎన్ఆర్ఐ.. రూ. లక్ష ఆర్థిక సాయం
X

దిశ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లం జామిని గ్రామంలో అప్పుల‌ బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆదివాసీ రైతు యెర్మ తుల‌సీరాం కుటుంబానికి ఎన్నారై TV కంది శ్రీ‌నివాస‌రెడ్డి ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దును అంద‌జేశారు. అలాగే పిల్ల‌ల చ‌దువుకోసం ప‌ది వేల రూపాయ‌లు ఇచ్చారు. మొట్ట‌మొద‌టిసారిగా త‌మ గ్రామానికి విచ్చేసిన కంది శ్రీ‌నివాస‌రెడ్డికి గ్రామ‌స్తులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల‌తో జామిని గ్రామం కోలాహ‌లంగా మారింది. ఆమెరికాలో ఉన్న త‌న‌కు ఇక్క‌డ ఆత్మ‌హ‌త్య వార్త తెలిసిందని, వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా త‌క్ష‌ణ ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించాన‌ని కంది శ్రీ‌నివాసరెడ్డి మీడియాతో తెలిపారు. అలాగే పిల్ల‌ల చ‌దువు బాధ్య‌త కూడా తాను తీసుకుంటానన్నారు. రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ప్ర‌క‌టించిన న‌గ‌దును అందించాన‌ని తెలిపారు.

అనంత‌రం త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వేలాదిమంది జ‌నం మ‌ధ్య‌లోకి వెళ్లి ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకున్నారు. వారిని ఎంతో ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. ఎవ‌రూ కూడా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని, క‌ష్ట‌సుఖాలు సాధార‌ణ‌మ‌ని అన్నారు. చీక‌టి త‌ర్వాత వెలుగు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని, ఆ వెలుగు కోసం ఎదురుచూడాలి త‌ప్పితే ప్రాణాలు తీసుకోవ‌ద్ద‌ని, పిల్ల‌ల‌ను అనాథ‌లుగా మార్చ‌వ‌ద్ద‌ని వేడుకున్నారు. చ‌దువుతోనే ఏదైనా సాధించొచ్చ‌ని, చ‌దువు ఒక్క‌టే మ‌నిషిని అద్భుతంగా తీర్చిదిద్దుతుంద‌ని తెలిపారు. తాను సైతం ఒక పేద రైతు కుటుంబంలో జ‌న్మించి ఇవాళ ఈ స్థాయికి ఎదిగాన‌ని తెలిపారు. ఆయ‌న మాట్లాడుతున్నంత‌సేపు జ‌నం చ‌ప్ప‌ట్ల‌తో ఉత్సాహ ప‌రిచారు.అటు అభిమానులు ఆయ‌న‌తో సెల్పీలు దిగేందుకు ఉత్సాహం క‌న‌బ‌రిచారు. కంది శ్రీ‌న‌న్న‌కు జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నానికి కంది శ్రీ‌నివాసరెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో భోజ‌న స‌దుపాయం ఏర్పాటు చేశారు. అంత‌కుముందు హైద‌రాబాద్ నుండి బ‌య‌లు దేరిన కంది శ్రీ‌నివాసరెడ్డికి మార్గ‌ంమ‌ధ్య‌లో బోథ్ ఎక్స్ రోడ్డు వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. బోథ్ ప్ర‌ముఖులు, అభిమానులు పూల‌బోకేలతో గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. శాలువాల‌తో ఆత్మీయ స‌న్మానం చేశారు.



Next Story

Most Viewed