నేటి భారతం.. అక్కడ జన్మభూమి కోసం పోరాడుతుంటే.. ఇక్కడ సొంత భూమి కబ్జా..!

by Bhanu |

మండల కేంద్రం సమీపంలోని బోథ్ (k) శివారులోని సర్వేనెంబర్ 36/అ లో ఉన్న తమ భూమిని మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం భూ యజమాని కోడలు కుర్మే లక్ష్మి ఆరోపించారు.

నేటి భారతం..  అక్కడ జన్మభూమి కోసం పోరాడుతుంటే.. ఇక్కడ సొంత భూమి కబ్జా..!
X

దిశ, బోథ్: మండల కేంద్రం సమీపంలోని బోథ్ (k) శివారులోని సర్వేనెంబర్ 36/అ లో ఉన్న తమ భూమిని మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం భూ యజమాని కోడలు కుర్మే లక్ష్మి ఆరోపించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాము గత ముప్పై సంవత్సరాల నుండి ఈ భూమి సాగు చేస్తూ జీవిస్తున్నామన్నారు.అయితే మా ప్రక్కనే ఉన్న భూమి ఇటీవల ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుండి మరో ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొనుగోలు చేసారని అన్నారు.

కొనుగోలు చేసింది ఒకచోట అయితే మా భూమి ని ఎందుకు దున్నారని ప్రశ్నించారు. అయితే తమ భూమిని దున్నిన వారి నుండి మా భూమిని కాపాడాలని కోరారు. మా కొడుకులు దేశ సేవ లో ఉంటే ఇక్కడ మా భూమిని దున్నేయ్యడం అన్యాయమని అన్నారు. మాకు జరిగిన అన్యాయం పై అధికారులు స్పందించాలని లేదంటే మాకు చావే శరణ్యమని అన్నారు.

మేము దేశ సేవలో ఉంటే మా భూమిని కబ్జా చేస్తున్నారు: ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్.

మా తమ్ముడితో పాటు తాను దేశ రక్షణ కోసం ఆర్మీ, నేవీలలో పనిచేస్తుంటే.. తాము లేకుండా చూసి అమాయకురాలైన మా తల్లికి తెలియకుండా కొంతమంది మా భూమిని ఆక్రమించుకుంటున్నారని ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ శ్రీనివాస్ వాపోయారు. ఈ విషయంలో జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Next Story