దిశ ఎఫెక్ట్ : పత్రిక శబ్దానికి ప్రభావం.. త్రాగునీటి సమస్యకు పరిష్కారం

by Bhanu |   (  Updated:2025-07-27 04:58:02  IST  )

ముధోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు ఖాళీ బిందెలతో

దిశ ఎఫెక్ట్ : పత్రిక శబ్దానికి ప్రభావం.. త్రాగునీటి సమస్యకు పరిష్కారం
X

దిశ, ముధోల్ : ముధోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు ఖాళీ బిందెలతో భైంసా-బాసర జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై దిశ దినపత్రిక లో కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు.

ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణానంద్‌కు ఎంపీడీవో శివకుమార్ ఆదేశాలు జారీ చేసి, కాలనీలో చెడిపోయిన బోర్ మోటారును తక్షణమే రిపేర్ చేయించాలని సూచించారు. సిబ్బంది హుటాహుటిన స్పందించి బోర్ మోటార్ మరమ్మతులు చేయడంతో కాలనీలో త్రాగునీటి సరఫరా పునరుద్దరమైంది. దీంతో సమస్య పరిష్కారమై కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన దిశ పత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story