- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ఐఐఐటీలో విద్యార్థుల ఆందోళన
బాసర ఐఐఐటీలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విద్యార్థి మృతి ఘటన నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

దిశ, బాసర : బాసర ఐఐఐటీలో ఇటీవల ఒక విద్యార్థి మృతి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆసుపత్రి నిర్లక్ష్యం, తగిన వైద్య సదుపాయాల లేమి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి విద్యార్థులు ఏబీ3 భవనంలోని వీసీ చాంబర్ వద్ద నిరసన చేపట్టారు. క్యాంపస్‌లో మెరుగైన ఆసుపత్రి సదుపాయాలు, సమయానుకూల వైద్య సేవలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదు. ప్రతి విద్యార్థికి సరైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది” అని విద్యార్థులు పేర్కొన్నారు. ఇది కేవలం కొంతమంది విద్యార్థుల సమస్య కాదని, మొత్తం విద్యార్థుల బాధ్యతగా భావించి అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






