శోభయాత్రలో మజ్జిగ పంపిణీ చేసిన ముస్లిం యువకులు

by Dishanational1 |
శోభయాత్రలో మజ్జిగ పంపిణీ చేసిన ముస్లిం యువకులు
X

దిశ, ముధోల్: మండల కేంద్రమైన ముధోల్ తోపాటు వివిధ గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక పురాతన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీరాముని ప్రతిమను ప్రతిష్టించి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం ముందు యువకులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీరాముని శోభాయాత్ర పురస్కరించుకుని ప్రధాన వీధుల్లో భక్తుల సౌకర్యార్థం మజ్జిగను పంపింణీ చేశారు. ముఖ్యంగా స్థానిక మజీద్ చౌక్ లో ముస్లిం యువకులు భక్తుల సౌకర్యార్థం నీళ్లు, మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముధోల్ సీఐ వినోద్ రెడ్డి, ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా శ్రీరామనవమి వేడుకల సందడి కనిపించింది.




Next Story

Most Viewed