- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా : ఏసీపీ రవికుమార్
దిశ, మంచిర్యాల : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం

దిశ, మంచిర్యాల : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అల్లర్లు, బెదిరింపులకు పాల్పడితే చర్యలకు ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి సమయాల్లో గుంపులుగా తిరుగుతూ కనబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టి మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీలో పాల్గొనరాదన్నారు. పోలింగ్ బూతుల వద్ద కలహాలు, అల్లర్లు సృష్టించిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనలను పుల్లంగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. ఎన్నికలు ముగిసేంతవరకు రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టౌన్, రూరల్ సీఐ లు శ్రీనివాస్, హనుక్, తాండూర్ సీఐ దేవయ్య, డివిజన్ లోని పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.






