- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్యాస్ స్టవ్‌లు పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ రేంజ్‌లోని ఇందిరగాం, జై హిందూపూర్ గ్రామాల గ్రామాలకు సిరిపూర్ ఎమ్మెల్యే గ్యాస్ స్టవ్‌లు అందజేశారు.

దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ రేంజ్‌లోని ఇందిరగాం, జై హిందూపూర్ గ్రామాల గ్రామాలకు గిరిజనులకు గ్యాస్ స్టవ్‌లను సిరిపూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న గ్యాస్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడవులను నరకవద్దని ప్రభుత్వం ఇచ్చే ఉచిత గ్యాస్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అటవీశాఖ సేవా కార్యక్రమాలు చేపడుతుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బెజ్జూర్ రేంజ్ లోని సుష్మిర్, గొర్రెగూడ గ్రామాలకు 20, జైహింద్పూర్ గ్రామాల ప్రజలకు 20, గ్యాస్ స్టవ్‌లు అందజేశారు. అటవీ సిబ్బందికి టూల్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిఎఫ్ ఓ నీరజ్ కుమార్ టీబ్రీవాల్, కాగజ్నగర్ ఎండిఓ అప్పయ్య, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భార్గవ్, బెజ్జూర్ రేంజ్ అధికారి ముసవీర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్, కృష్ణ పెళ్లి సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య , బీట్ ఆఫీసర్లు మురళి, వెంకటేష్ గోపాల్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.






