అక్ర‌మ ఇసుక ట్రాక్ట‌ర్ల ప‌ట్టివేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రిచిని గ్రామ సమీప ప్రాంతాల వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ లను ఆదివారం జిల్లా మైనింగ్ శాఖ అధికారులు మాటు

అక్ర‌మ ఇసుక ట్రాక్ట‌ర్ల ప‌ట్టివేత
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రిచిని గ్రామ సమీప ప్రాంతాల వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ లను ఆదివారం జిల్లా మైనింగ్ శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. తాండూరు మండలంలోని రేచిని సమీప వాగుల నుండి రేపల్లె వాడలోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుకు అక్రమ ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. జిల్లా మైనింగ్ శాఖ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాను సారం మైనింగ్ సిబ్బంది మాటు వేసి ట్రాక్టర్లలో అక్రమంగా తరలించే ఇసుక లోడుతో జిన్నింగ్ మిల్లుకు తరలించిన ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో కొద్ది రోజుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. 5 ఇసుక ట్రాక్టర్లను తాండూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Next Story