- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు కళకళ.. నేడు వెలవెల
గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు వాంకిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎఫ్సీ కామన్ ఫెసిలిటీ సెంటర్ సంక్షోభంలో పడింది.

దిశ, వాంకిడి : గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు వాంకిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎఫ్సీ కామన్ ఫెసిలిటీ సెంటర్ సంక్షోభంలో పడింది. ఒకప్పుడు పనులతో కళకళలాడిన సీఎఫ్సీ ప్రస్తుతం ఆర్డర్లు లేక మూతపడింది. దీని పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. 1971లో రాష్ట్ర వ్యాప్తంగా 56 సీఎఫ్సీ సెంటర్ లు ప్రారంభం కాగా అన్ని కేంద్రాలు మూతపడగా వాంకిడి సీఎఫ్సీ మాత్రం ఆదరణ పొంది ఉనికిని చాటుకుంది. ఈ క్రమంలో సీఎఫ్సీని ఐటీడీఏ ఆధినంలో తీసుకుని నిరుద్యోగ గిరిజన యువతకు ఫర్నీచర్ తయారిలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. యువతకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 1987-88లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం షేడ్ లు. భవనాలు నిర్మించి ఫర్నీచర్ తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చి ఆధునీకరణ చేశారు.
నాడు సీఎఫ్సీ అధికారుల ప్రొత్సాహం
1991లో ఐటీడీఏ అధికారుల ప్రొత్సాహంతో 335 మందికి వృత్తి శిక్షణ ఇచ్చారు. కాలక్రమేణ కూలీల కొరత ఏర్పడటంతో 1996-99లో మెటల్ వర్క్స్ తో తయారు చేయడం చేపట్టారు. సీఎఫ్సీ పనితనాన్ని గుర్తించిన అప్పటి కలెక్టర్. ఐటీడీఏ అధికారులు సీఎఫ్సీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆధునిక యంత్రాలను సమకూర్చారు. దీంతో కార్మికులు కలపతో భావనలకు అమర్చే తలుపులు. కీటికిలు. టేబుల్లు. సొఫాసెట్ లు. డైనింగ్ టేబుల్. డ్రిస్సింగ్ టేబుల్ తయారు చేసేవారు. ప్రస్తుతం కలప లభించకపోవడంతో ఇనుముతో బీరువాలు. బెడ్ లు. డ్యూయల్ డెస్కులు లాంటి వస్తువులను కార్మికులు తయారు చేస్తున్నారు.
కార్మికులకు కరువైన ఉపాధి..
అధికారుల పట్టింపు లేకపోవడంతో సీఎఫ్సీకి ఆదరణ కరువైంది. 2012 నుంచి సరైన పనులు లేక ఈ పరిశ్రమ సంక్షోభం పడింది. 2015లో పనులు లేక పరిశ్రమ మూతపడింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. అప్పటి ఐటీడీఏ పీవో సీఎఫ్సీని సందర్శించి పరిశ్రమను పునః ప్రారంభించారు.. మళ్లీ కొంతకాలానికి సీఎఫ్సీ ఆర్డర్లు లేక మల్లి మూతపడింది. ఇలా ఇప్పటికే నాలుగు ఐదు సార్లు మూతపడింది. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికుల పరిస్థితి అధోగతి గా మారింది.
ఉపాధి కోసం అల్లాడుతున్న కార్మికులు
సీఎస్సీ మూతబడటంతో ఏడాదిగా పనులు లేక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ సైతం వారికి భారంగా మారింది. దీంతో చాలా మంది రోజువారీ కూలీ పనులకు వెళ్తుండగా మరికొంతమంది కార్మికులు ఉపాధి కోసం అల్లాడుతున్నారు. ఇప్పటికే పాలకులు ఐటీడీఏ అధికారులు స్పందించి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించేలా తాగు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు






