ట్రిపుల్ ఐటిలో 41 మంది అధ్యాపకుల రాజీనామా.. ఎందుకంటే..?

by Naveena |

ప్రభుత్వ జీవో21 పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బుధవారం ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న 41 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ట్రిపుల్ ఐటిలో 41 మంది అధ్యాపకుల రాజీనామా.. ఎందుకంటే..?
X

దిశ, బాసర: ప్రభుత్వ జీవో21 పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బుధవారం ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న 41 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము అదనపు బాధ్యతలను చేయలేమంటూ.. తమ బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా చేస్తూ లేఖను కళాశాల ఏవో రణధీరు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్, పరిపాలన బాధ్యతలతో పాటు విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఊరుకోమన్నారు.

Next Story