గోతులమయం.. ప్రయాణం భయం.. లక్ష్మీపూర్ చెరువు వద్ద నరకప్రాయం

by Ajay Maddhiboyina |

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రహదారి లో నాణ్యత కొరవడి గుంతల మయంగా మారింది. ఈ రహదారిలో రాకపోకలు సాగించాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు.

గోతులమయం.. ప్రయాణం భయం.. లక్ష్మీపూర్ చెరువు వద్ద నరకప్రాయం
X

దిశ, భీమిని: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రహదారి లో నాణ్యత కొరవడి గుంతల మయంగా మారింది. ఈ రహదారిలో రాకపోకలు సాగించాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. ఈ మార్గం లోనే ప్రయాణిస్తున్న గోతులు మాత్రం పూడ్చే సంగతి మాత్రం గాలికొదిలేశారు. భీమిని మండలం నుండి కర్జీబీంపూర్ వరకు 10 కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి నాణ్యత లోపించి కంకర తేలడంతో గుంతల మయంగా తయారైంది. కాంట్రాక్టర్ రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తేటతెల్లమవుతుంది. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలకు మాత్రమే పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రహదారి పొడవునా గోతులే...

మంచిర్యాల జిల్లా భీమిని మండలం లక్షింపూర్ గ్రామం నుండి కర్జి బీంపూర్ గ్రామం వరకు 10 కిలోమీటర్ల మేర 2018 లో నిర్మించిన రహదారి 5 సంవత్సరాలకే నాణ్యత లోపించి గుంతల మయంగా మారింది. దీంతో నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో రాకపోకలు సాగిస్తున్న వారు గుంతల కారణంగా ప్రమాదాల పారిన పడుతున్నారని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం తో సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిసర గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే భయాందోళన చెందుతున్నారు.

ప్రమాదకర మూలమలుపులు

ఈ రహదారి మార్గంలో ఆరు ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. వాహనాలు దగ్గరికి వచ్చే వరకు గుంతలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. రహదారిపై ఉన్న తారు మొత్తం కంకర తేలి పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తోంది. గతంలో మట్టితో రహదారి ఉండగా రోడ్డు మంజూరు అయిన సమయంలో అధికారులు చేసిన రోడ్డు విస్తరణ పనులు నాణ్యత తిలోదాకాలకు అద్దం పడుతుంది. నిబంధనలు పాటించకపోవడంతో రహదారి ఐదు సంవత్సరాలకే కాలం చెల్లిన మాదిరి గా తయారవడంతో పల్లె గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన రహదారి పగుళ్లు తేలి అనతి కాలంలోనే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.రూ.516.23 అంచనా విలువ, 5 సంవత్సరాల మెయింటెనెన్స్ గాను రూ.39.97 లక్షలు కేటాయించారు. టెండర్లు పొందిన గుత్తేదారు 2019 లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి 2024 సంవత్సరంలో పూర్తి చేశాడు. రోడ్డు పొడవు 10.6 కిలోమీటర్ల వరకు ఉండగా, తారు రోడ్డు 9.8 కిలోమీటర్ల వరకు కేటాయించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారు ఇస్తారాజ్యం వేరసి రోడ్డు గుంతల మయంగా ప్రమాదాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం లో లక్ష్మీపూర్ గ్రామ చెరువు సమీపంలో పెద్ద పెద్ద గుంతలలో నీరు నిలువ చేరితే వాహనాలు నడపడం ఏమోగానీ నడవడానికి నరకప్రాయంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు రహదారి గుంతలను పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Next Story