సత్వర న్యాయ సేవలు అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Ratna Kumari |

దిశ, మంచిర్యాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్

సత్వర న్యాయ సేవలు అందించాలి :  కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్ లో పౌర హక్కులు రక్షణ ఎస్సీ, ఎస్టీ నివారణ చట్టం అమలుపై ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, షెడ్యూలు కులాల అధికారి దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ,ఎస్టి ప్రత్యేక కోర్టులలో కేసులు సత్వర పరిష్కారం కోసం ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. కేసుల విచారణ లో జాప్యం జరగకుండా బాధితులకు న్యాయ సేవలు అందే విధంగా చూడాలన్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు డివిజన్ ల‌ వారిగా కేసులకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. బాధితులకు సత్వర న్యాయంతో పాటు నష్టపరిహారాలు, ప్రేరేపిత కేసులతో చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసులు నమోదు కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం నిర్వహణలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. పౌర హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలకు చెందిన సంక్షేమ వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ సతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దమ్మ. నారాయణ, పౌర సంబంధాల అధికారి ఎం. కృష్ణమూర్తి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా వయోజన విద్య శాఖ అధికారి పురుషోత్తం నాయక్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, మాధ్యమిక విద్యాశాఖ అధికారి అంజయ్య పాల్గొన్నారు.

Next Story