పీఎస్ఆర్ V/S దివాకర్ రావు..

by Disha Web Desk 20 |
పీఎస్ఆర్ V/S దివాకర్ రావు..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల నియోజవర్గంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో నాయకుల ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోవడం తీవ్రదుమారం లేపుతుంది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఒకరేమో "పేకాటరావు" మరొక వర్గం వారేమో "దిమక్ లేని రావు" అని ఫోటో లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పరస్పర పోస్టులు చేస్తున్నారు. ఇరువర్గాలవారు సోషల్ మీడియా వేదికగా ఇష్టాను సారం పోస్టులు చేసుకోవడం నియోజక వర్గంలో తీవ్రచర్చలకు దారి తీసింది. అవి చూసిన నియోజక వర్గ ప్రజలు కంగుతింటున్నారు. రాజకీయ నాయకులు అభివృధి పనులను చూపిస్తూ ప్రచారం కొనసాగించాలీ కానీ ఇలా నువుదొంగ అంటే నువుదొంగ అని దుషించుకోడం ఎంటి అని ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మేల్యే నడిపెళ్ళి దివాకర్ రావు కొడుకు విజిత్ సైతం మంచిర్యాల నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తూ పలుకార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాడు అయితే అతన్ని కూడా "పప్పురావు"లండన్ లో చదివిన లండన్ బాబుకి ఇక్కడి ప్రజల సమస్యలు ఎం తెలుస్తాయి అంటూ ఒక ప్రచార పోస్టర్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇటీవల కాంగ్రెస్ మహిళ నాయకురాలు సురేఖను సైతం "మహనటి" అంటూ ఆ పోస్టర్లో భాగస్వామిని చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలకలం రేపింది. ఎదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ మహిళ అయిన సురేఖను పోస్టర్ లోకి లాగడం ఎంటి అని వారు ప్రశ్నించిన తీరు తీవ్రవిమర్శలకు దారి తీసింది. గతంలో ను విజిత్ పలు బీఆర్ఎస్ సమావేశాల్లో సురేఖ గురించి తప్పుగా మాట్లాడినపుడు కాంగ్రెస్స్ లో ఉన్న మహిళ నాయకురాల్లు అందరూ కలిసి ఎమ్మేల్యే ఇంటిని ముట్టడించి నానా హంగామా చేశారు. ఈ సారి తీరు మార్చుకోవాలని విజిత్ ను పలువురు హెచ్చరించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మార్ఫింగ్ ఫోటోలు పోలీస్ శాఖ వారు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా వచ్చి కేస్ పెట్టినపుడు చూద్దాంలే అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇలాంటి పోస్ట్ లు పెట్టి ప్రచారం చేసిన వారిని కొందరిని పోలీస్ లు హెచ్చరించి వదిలేశారని, సోషల్ మీడియాలో ఇంకెపుడూ ఇలాంటి ప్రచారాలు చేయొద్దని హెచ్చరించినట్లు సమాచారం.

Next Story