సమస్యల వలయంలో పల్లె దవాఖాన

by Kalyani |
సమస్యల వలయంలో పల్లె దవాఖాన
X

దిశ, రుద్రంగి : రుద్రంగి మండలకేంద్రంలోని పల్లె దవాఖాన సమస్యల వలయంలో కూరుకుపోయింది. ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండే పల్లె దవాఖానలో నీటి కరువు ఏర్పడింది. కనీసం బోర్ మోటార్ లేకపోవడంతో చుట్టుపక్కల ఇండ్లలో నుంచి బాకిట్లతో నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. నీటి వసతి లేకపోవడంతో ప్రథమ చికిత్స చేయాల్సిన ఆశావర్కర్లు బాకిట్లతో నీటిని తీసుకురావడం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రోజు చుట్టూ పక్కల ఉన్న బోరు బావుల నుంచి నీటిని తెస్తూ వారు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా అరకొర వసతులతో పల్లె దవాఖాన నిర్మాణం చేపట్టడంతో సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కిటికీ అద్దాలు, వెంటిలేటర్లు పగిలిపోయాయి పల్లె దవాఖాన శిధిలావస్థకు చేరుకున్నట్లు మారింది. బాత్రూం, ల్యాబ్ లలో నీటి వసతులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి, పల్లె దవాఖాన వద్ద బోర్ మోటార్ ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలతో పాటు మరమత్తు పనులు చేయాలని వారు కోరుతున్నారు.

Next Story

Most Viewed