- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి..కలెక్టర్ కు బిల్డర్స్ అసోసియేషన్ వినతి
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి..కలెక్టర్ కు బిల్డర్స్ అసోసియేషన్ వినతి
దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఏండ్లుగా పేరుకుపోతున్నాయని బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేమని బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.

X
దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఏండ్లుగా పేరుకుపోతున్నాయని బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేమని బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్శి షా తో పాటు పంచాయతీ రాజ్ ఎస్ఈ జాదవ్ ప్రకాష్ కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖలతో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.బిల్లులు రాకపోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని మిగిలిన పనులు చేయలేని పరిస్థితి ఉందని వివరించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.ఇందులో అసోసియేషన్ అధ్యక్షుడు ఏం.రామారావు,నాయకులు గుట్ట నవీన్,ఎస్. కృష్ణారావు,గాజుల సదానంద్,లింగా రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story






